ఇక రేసులోకి.. | - | Sakshi
Sakshi News home page

ఇక రేసులోకి..

Oct 28 2023 7:30 AM | Updated on Oct 28 2023 7:30 AM

- - Sakshi

మల్‌రెడ్డి

రంగారెడ్డి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో హస్తం అభ్యర్థుల ఖరారు పూర్తయింది. తొలి జాబితాలో ముగ్గురి పేర్లను ప్రకటించిన అధిష్టానం తాజాగా శుక్రవారం ప్రకటించిన రెండో జాబితాలో మిగతా అభ్యర్థులను ఖరారు చేసింది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంపై ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల బలాబలాలు, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకు ప్రాధాన్యమిచ్చినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఎల్‌బీనగర్‌ స్థానానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను ప్రకటించింది. రాజేంద్రనగర్‌ స్థానానికి సంబంధించి ఆచితూచి వ్యవహరించింది. అక్కడి నుంచి మణికొండ మున్సిపల్‌ చైర్మన్‌ కస్తూరి నరేందర్‌ ముదిరాజ్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ఇటీవల అధికార బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి కూడాఅధిష్టానం పెద్దపీట వేసింది. సీనియర్లు, పార్టీ విధేయులను సైతం పక్కకు పెట్టి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ ఫోర్ల్‌లీడర్‌వి.జగద్వీశర్‌ గౌడ్‌కు శేరిలింగంపల్లి టికెట్‌ ఇచ్చింది. ఆయన అధికార బీఆర్‌ఎస్‌ నుంచి శేరిలింగంపల్లి టికెట్‌ ఆశించి భంగపడి తన భార్య కార్పొరేటర్‌ పూజితతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన విషయం విధితమే. జగద్వీశర్‌ గౌడ్‌కు ఈ నియోజకవర్గంలో గట్టి పట్టుంది.

మధుయాష్కీ

జగదీశ్వర్‌ గౌడ్‌

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం

అభ్యర్థి: మల్‌రెడ్డి రంగారెడ్డి

పుట్టిన తేదీ: 01–10–1958

తల్లిదండ్రులు: మల్‌రెడ్డి రాములమ్మ, బాల్‌రెడ్డి

భార్య: అనసూయరెడ్డి

పిల్లలు: నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు

స్వగ్రామం: తొర్రూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం

విద్యార్హత: డిగ్రీ

రాజకీయ నేపథ్యం: 1981లో తొర్రూర్‌ సర్పంచ్‌గా రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టి 1987 వరకు కొనసాగారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. తుర్కయంజాల్‌ రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌గా, మలక్‌పేట వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మలక్‌పేట టీడీపీ ఎమ్మెల్యేగా 1994–1999 వరకు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా 2004–2009 వరకు కొనసాగారు. 2009లో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, 2018లో మరోసారి ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

మహేశ్వరం నియోజకవర్గం

అభ్యర్థి: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

పుట్టిన తేదీ: 24–04–1956

తల్లిదండ్రులు: రామలక్ష్మమ్మ, కొండారెడ్డి

భార్య: విజయలక్ష్మి

పిల్లలు: అనురూప్‌, అభిషేక్‌

స్వగ్రామం: మాసానిగూడ, శంకర్‌పల్లి మండలం

విద్యార్హత: ఎమ్మెస్సీ

రాజకీయ నేపథ్యం: 1999లో చేవెళ్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2000 ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో దిగి కాంగ్రెస్‌ అభ్యర్థి సబితారెడ్డిపై పోటీ చేసి ఓటమిచెందారు. 2009లో మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నక్కా ప్రభాకర్‌గౌడ్‌పై విజయం సాధించారు.

కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

జిల్లాలో పూర్తయిన అభ్యర్థుల ప్రకటన

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం నుంచికిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

1
1/5

2
2/5

కిచ్చన్నగారి 
లక్ష్మారెడ్డి3
3/5

కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

నరేందర్‌ ముదిరాజ్‌4
4/5

నరేందర్‌ ముదిరాజ్‌

5
5/5

Advertisement
 
Advertisement
Advertisement