కరీంనగర్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూంలో ‘ఆర్ట్ ఇన్ ఎవ్రీ జువెల్’ పేరుతో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. అక్టోబర్ 23 నుంచి 26 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది. బంగారం, వజ్రాభరణాల్లో సంప్రదాయ కళాత్మకతను ఆధునిక డిజైన్లతో మేళవించి రూపొందించిన ప్రత్యేక ఆభరణాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధులు మాట్లాడుతూ... వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న డిజైన్లలో ఆభరణాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనను సందర్శించి తమకు నచ్చిన డిజైన్లను ఎంపిక చేసుకోవాలని కోరారు. మలబార్ ప్రతినిధులు ఫవాజ్‌కబీర్, వివేక్, సిద్దాంత్, సోహెల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


