1న స్కాలర్‌షిఫ్‌ టెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

1న స్కాలర్‌షిఫ్‌ టెస్ట్‌

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

విద్యానగర్‌(కరీంనగర్‌): పేద విద్యార్థులకు ఫీజు రాయితీతో కూడిన కార్పొరేట్‌ విద్యను అందించడానికి వచ్చేనెల 1న 10వ తరగతి విద్యార్థులకు శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యా సంస్ధల అధినేత ఎం.రమేశ్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం నగరంలో ఆవిష్కరించారు. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఫీజు రాయితీతో పాటు మొదటి బహుమతి లాప్‌టాప్‌, రెండు నుంచి పదో ర్యాంకు వారికి టాబ్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్‌, తదితర వివరాలకు 98485 87584, 99123 49038 నంబర్లలో సంప్రదించాలన్నారు. విద్యాసంస్ధల డైరెక్టర్‌ కర్ర నరేందర్‌రెడ్డి, జూనియర్‌ కళాశాలల డీన్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

లక్కీడ్రా పేరుతో మోసం

జగిత్యాలక్రైం: ఇటీవల ముగిసిన దసరా శరన్నవరాత్రోత్సవాల్లో అమ్మవారి మండపం వద్ద లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిని శుక్రవారం అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు టౌన్‌ సీఐ కరుణాకర్‌, ఎస్సై సుప్రియ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని అష్టలక్ష్మీ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద కథలాపూర్‌ మండలం పెగ్గర్ల గ్రామానికి చెందిన బోడ లక్ష్మీనరసయ్య, జగిత్యాలకు చెందిన మానపురి కిరణ్‌ జైభవాని లక్కీ డ్రా పేరుతో లాటరీ ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి బహుమతి కింద ఎలక్ట్రిక్‌ బైక్‌, రెండో బహుమతి ఎలక్ట్రిక్‌ బైక్‌, మూడో బహుమతి వన్‌గ్రాం గోల్డ్‌ వంటి ఎనిమిది బహుమతులను విజేతలకు అందిస్తామని కూపన్లు అమ్మారు. రూ.100 ఒక కూపన్‌ చొప్పున 7 వేల కూపన్లు అమ్మారు. జగిత్యాల పట్టణానికి చెందిన చింతల రాజేశ్వర్‌ రూ.200 వెచ్చించి రెండు కూపన్లు తీసుకున్నాడు. ఈ నెల 21న దసరా సందర్భంగా డ్రా ఉంటుందని అక్కడికి వెళ్లిన రాజేశ్వర్‌కు అప్పటికే డ్రా అయిపోయినట్లు, నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారించగా నిర్వాహకులే రూ. 5,150 విలువ చేసే కూపన్లు కొనుగోలు చేసి వారిపేర్లను రాసుకుని, డ్రాలో రెండు బైక్‌లు, మూడు సైకిళ్లు గెలుపొందడంలో మోసానికి పాల్పడినట్లు తేలింది. ఈకేసులో లక్ష్మీనరసయ్యను అరెస్టు చేయగా, కిరణ్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ కరాటే పోటీల్లో స్వర్ణం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: శ్రీలంకలో ఇటీవల జరిగిన అంతర్జాతీయస్థాయి కరాటే పోటీల్లో స్థానిక కాకతీయ స్మార్ట్‌ కిడ్స్‌ పాఠశాలకు చెందిన కె.ఆదిత్య సాయి అండర్‌–14 విభాగంలో బంగారు పతకం సాధించినట్లు కోచ్‌ ఆర్‌.ప్రసన్న కృష్ణ తెలిపారు. శుక్రవారం ఆదిత్య సాయిని కరస్పాండెంట్‌ క్రాంతి కుమార్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement