అధికారులకు విన్నవించా | - | Sakshi
Sakshi News home page

అధికారులకు విన్నవించా

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని తిమ్మాసికుంట చెరువు హద్దులు నిర్ణయించాలని అధికారులకు ఏడాది నుంచి విన్నవిస్తున్నాను. అక్కడ దాదాపు రెండు నుంచి మూడు ఎకరాల వరకు కబ్జాకు గురైనట్లు సమాచారం. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరాం. హద్దులు నిర్ణయించాలని విన్నవించినం.

– ఒగ్గు బాలరాజుయాదవ్‌, మాజీ ఎంపీటీసీ

శిఖం భూములు అన్యాక్రాంతం

ఎల్లారెడ్డిపేటలోని గిద్దచెరువులో శిఖం భూములను కొందరు కబ్జా చేశారు. ఈ విషయంపై గతంలో రెవెన్యూ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినం. చెరువు శిఖం భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. చెరువు చుట్టూ హద్దులను ఏర్పాటు చేసి భూములు ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాలి.

– బంధారపు మల్లారెడ్డి, రైతు, ఎల్లారెడ్డిపేట

విచారణ చేస్తాం

చెరువుల శిఖం భూములు ఎవరైనా కబ్జా చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. భూములు కబ్జా అయినట్లు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటాం.

– దివ్యజ్యోతి, తహసీల్దార్‌, ఎల్లారెడ్డిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement