లక్షల్లో ఖర్చు.. వెలగని లైట్లు! | - | Sakshi
Sakshi News home page

లక్షల్లో ఖర్చు.. వెలగని లైట్లు!

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

● వేములవాడలో ప్రధాన రోడ్లపై అంధకారం ● పట్టించుకోని అధికారులు ● భయాందోళన చెందుతున్న పట్టణ ప్రజలు

వేములవాడ ప్రొఫైల్‌

● వేములవాడలో ప్రధాన రోడ్లపై అంధకారం ● పట్టించుకోని అధికారులు ● భయాందోళన చెందుతున్న పట్టణ ప్రజలు

వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణం వేములవాడ వీధుల్లో రాత్రయితే అంధకారం నెలకొంటుంది. ప్రతీ నెల లక్షల్లో బిల్లులు చెల్లిస్తున్నా దక్షిణ కాశీలో వెలుగులు పరచుకోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణ, మరమ్మతుల పేరిట లక్షలు వెచ్చిస్తున్నా ప్రధాన రహదారులు, కాలనీలు, విలీన గ్రామాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి.

28 వార్డులు..84 కాలనీలు

వేములవాడ పట్టణం 28 వార్డుల వ్యాప్తంగా 84 కాలనీలుగా విస్తరించింది. అయితే శివారు కాలనీల్లో వీధిదీపాలు వెలగడం లేదు. నెలల తరబడి పనిచేయకపోవడంతో రాత్రయితే బయటకు వచ్చేందుకు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ప్రతీ సంవత్సరం లక్షల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నా చీకట్లు మాత్రం తొలగడం లేదు.

వార్డులు 28

కాలనీలు 84

విలీన గ్రామాలు 05

జనాభా 45 వేలకు పైగా..

గృహాలు 11 వేలకు పైగా..

విద్యుత్‌ దీపాలు ఇలా

18 వాట్స్‌ 2,535

35 వాట్స్‌ 1,212

110 వాట్స్‌ 917

6 నెలలకు ఖర్చు : రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement