నేడు ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ రాక

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

సిరిసిల్ల: రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ శనివారం జిల్లాకు వస్తున్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేకాధికారిగా నియమితులైన ఆమె జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందిరానగర్‌లో ఇందిరా మహిళాశక్తి చీరల వస్త్రాల సేకరణలో పాల్గొంటారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సిరిసిల్లలోని మాక్స్‌ సంఘాల అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని చేనేత, జౌళిశాఖ అధికారులు కోరారు.

‘సర్‌’ కోసం పీసీసీ కో ఆర్డినేటర్లు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: సర్‌ ప్రక్రియను సమన్వయం చేసేందుకు పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పీసీసీ కో ఆర్డినేటర్‌లను నియమించింది. కరీంనగర్‌ పార్లమెంట్‌ కో–ఆర్డినేటర్‌గా మద్దెల సంతోష్‌ ముదిరాజ్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా శశిభూషణ్‌కాచెను నియమించారు. ధర్మపురి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా రహమత్‌ హుస్సేన్‌, రామగుండంకు గౌరి సతీశ్‌, మంథనికి డి.శ్రీనుబాబు, పెద్దపల్లికి ఈరవత్రి అనిల్‌కుమార్‌, కరీంనగర్‌కు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, చొప్పదండికి దుడెం వెంకట రమణ, వేములవాడకు నవీన్‌, సిరిసిల్లకు మొహమ్మద్‌ ఖాజా ఫఖ్రోద్దిన్‌, మానకొండూరుకు ఆడం రాజ్‌, హుజూరాబాద్‌కు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, హుస్నాబాద్‌కు సౌజన్యాగౌడ్‌ను కో ఆర్డినేటర్‌లుగా నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement