ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎఫెక్ట్‌

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

ఎఫెక్ట్‌ పేదల కల నిజం చేయడమే లక్ష్యం కనీస వేతనాలివ్వాలి బద్దిపోచమ్మ గుడిలో ఏఈవో ఎస్‌ఐఆర్‌పై డప్పుచాటింపు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

వేములవాడఅర్బన్‌: పేదల సొంతింటి కల నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడ అర్బన్‌ మండలం చింతాల్‌ఠాణాలో గురువారం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు.

సిరిసిల్లటౌన్‌: అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సేవలందించే కార్మికులకు ప్రభుత్వం కనీస వేతనాలివ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలలో పనిచేస్తున్న శానిటేషన్‌ స్వీపర్స్‌, సెక్యూరిటీగార్డ్‌, పేషంట్‌ కేర్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం ఒక్క రోజు దీక్ష చేపట్టారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరారు. సదా నందం, ఉమ, జ్యోతి, శ్రీలత, పద్మ, సుజాత, రేవతి, రమేశ్‌, రజిత, దేవరాజు, శ్రీకాంత్‌, మధులత, రాజేశ్‌, లత, అనిల్‌ పాల్గొన్నారు.

వేములవాడ: బద్దిపోచమ్మ ఆ లయంలో భక్తుల వద్ద అదనపు వసూళ్లు చేస్తున్న వైనా న్ని ‘పోచమ్మ సాక్షిగా పైసా వసూల్‌’ అనే కథనం సాక్షిలో ఈనెల 24న ప్రచురితమైంది. స్పందించిన ఈవో రమాదేవి ప్రత్యేక అధి కారిని నియమించారు. ఏఈవో లక్ష్మణ్‌రావును విధులు నిర్వర్తిస్తున్నారు.

వేములవాడ: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్‌)పై గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు డప్పు చాటింపు చేశారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, తొలగింపు, మార్పులు, చిరునామా సవరణకు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని గ్రామస్తులకు తెలియజేస్తున్నారు.

సిరిసిల్ల అర్బన్‌: ఎస్టీఎఫ్‌ఐ దేశవ్యాప్త పిలుపులో భాగంగా, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, వి ద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరు తూ టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్‌, జిల్లా అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు గుండమనేని మహేందర్‌రావు, జంగిటి రాజు, జిల్లా కార్యదర్శులు పాముల స్వామి, గుగులోత్‌ తిరుపతిజాదవ్‌, ఎంఎస్టీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సురేశ్‌ పాల్గొన్నారు.

జిల్లా ఎకై ్సజ్‌

సూపరింటెండెంట్‌గా హిమశ్రీ

సిరిసిల్లటౌన్‌: జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌గా హెచ్‌.హిమశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆదిలాబాద్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆమె బదిలీల్లో భాగంగా జిల్లా ఈఎస్‌గా నియమితులయ్యారు. కరీంనగర్‌ ఈఎస్‌గా పనిచేస్తూ సిరిసిల్ల ఇన్‌చార్జి ఈఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్‌రావు వరంగల్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. హిమశ్రీని సిరిసిల్ల, వేములవాడ ఎకై ్సజ్‌ సీఐలు శ్రీనివాస్‌, రాజశేఖర్‌, ఎస్సైలు ప్రశాంత్‌గౌడ్‌, అరుణ్‌, రవి, శ్రీనివాస్‌, నరేశ్‌ కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement