మత్తు రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మత్తు రహిత సమాజమే లక్ష్యం

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు

యాంటీడ్రగ్స్‌ ర్యాలీ

హన్మాజీపేటలో వాల్‌పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న విద్యార్థులు, అధికారులు

విద్యార్థుల ర్యాలీలో మాట్లాడుతున్న పోలీస్‌ అధికారులు

సిరిసిల్ల/సిరిసిల్లటౌన్‌/వేములవాడరూరల్‌: మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా ప్రజలు భాగస్వాములు కావాలని సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు కోరారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హెల్పింగ్‌ హార్ట్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్లలో సిగ్నేచర్‌ క్యాంపెయిన్‌, వేములవాడ రూరల్‌ మండలం హన్మాజిపేట ప్రభుత్వ పాఠశాలలో యాంటీడ్రగ్‌ అవేర్‌నెస్‌ సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ‘డ్రగ్స్‌ ఫ్రీ సిరిసిల్ల’ లక్ష్యంగా పౌరులు ముందుకురావాలని కోరారు. సరదా, ఒత్తిడి, చెడుస్నేహాలు, తప్పుదారి పట్టించే అలవాట్లు యువతను డ్రగ్స్‌ వైపు నెడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులను ముందుగానే గుర్తించి, యువతను సన్మార్గంలో నడిపించడం కుటుంబ సభ్యుల బాధ్యత అన్నారు. విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా నిలబడి యాంటీ డ్రగ్‌ ప్రతిజ్ఞ చేశారు. సిరిసిల్ల టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే 8712671111కు, సమీప పోలీస్‌ అధికారులకు తెలియజేయాలని సూచించారు. టౌన్‌ ఎస్సైలు గణేష్‌, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. సైకాలజిస్ట్‌ కె.పున్నంచందర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ బుర్ర నారాయణ గౌడ్‌, హెల్పింగ్‌ హార్ట్స్‌ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్‌, అడ్వకేట్‌ దాసరి తిరుమల, వేములవాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై చల్లా వెంకట్రాజం, సర్పంచ్‌ జంకె మధు, ఎంఈవో కిషన్‌, హెచ్‌ఎం శ్రీకాంత్‌రావు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ అంధకారం

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మాదకద్రవ్యాలతో భవిష్యత్‌ అంధకారం అవుతుందని డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. జిల్లెల్లలోని బాబు జగ్జీవన్‌రామ్‌ వ్యవసాయ కళాశాలలో ‘నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ నిర్వహించారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ ఎస్‌.ఉపేందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి హాజరయ్యారు. కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement