మహిళా చైతన్యంతోనే హక్కులకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

మహిళా చైతన్యంతోనే హక్కులకు రక్షణ

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మహిళా చైతన్యంతోనే హక్కుల రక్షణ సాధ్యమని మహిళా సాధికారత జిల్లా కేంద్రం కోఆర్డినేటర్‌ రోజా పేర్కొన్నారు. మండలంలోని గూడూరులో మహిళల హక్కులు, చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. రోజా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల రక్షణకు అనేక చట్టాలు చేసిందన్నారు. శారీరక, మానసిక వేధింపులకు గురైతే 181కు ఫోన్‌ చేయాలని కోరారు. వేధింపులకు గురైన వారికి సఖీ కేంద్రం, పోలీస్‌, న్యాయ వ్యవస్థల ద్వారా రక్షణగా కల్పిస్తామని తెలిపారు. సర్పంచ్‌ చీటి సునీత, పంచాయతీ కార్యదర్శి రత్నకుమారి, శ్రవణ్‌, దేవిక, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement