ప్రసూతి పూర్వ పరీక్షలు కీలకం | - | Sakshi
Sakshi News home page

ప్రసూతి పూర్వ పరీక్షలు కీలకం

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

సిరిసిల్ల: తల్లి ఆరోగ్యంగా ఉంటేనే శిశువు ఆరోగ్యంగా జన్మిస్తారని, మాతాశిశు మరణాలు తగ్గించడంలో ప్రసూతి పూర్వ పరీక్షలు కీలకమని జిల్లా వైద్యాధికారి ఏంజెల ఆల్ఫ్రెడ్‌ అన్నారు. అంబేడ్కర్‌నగర్‌ పీహెచ్‌సీని గురువారం తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ హైరిస్క్‌ గర్భిణీలను ఉన్నత వై ద్యకేంద్రాలకు రెఫర్‌ చేయాలన్నారు. గర్భిణీలకు ఐరన్‌, కాల్షియం మాత్రలు, పోషకాహారం, ప్రసూతి అనంతర సంరక్షణపై అవగాహన కల్పించాలని తెలిపారు. రక్తహీనత, అధిక రక్తపోటు, గర్భధారణ మధుమేహం వంటి సమస్యలను గుర్తించి తక్షణ వైద్యసలహాలు, చికిత్స అందించాలని ఆదేశించారు. మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేఖ, ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement