సిరిసిల్లటౌన్: మీజిల్స్, రూబెల్లా కేసులు నివేదించాలని జిల్లా వైద్యాధికారి ఎంజేలా ఆల్ఫ్రెడ్ సూచించారు. జిల్లా టీకా నియంత్రణ వ్యాధుల(నిఘా) కార్యక్రమంపై బుధవారం ప్రభు త్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోని పిల్లల వైద్య నిపుణులు, చర్మవ్యాధి నిపుణులు, ఫిజీషియన్లతో స మావేశమయ్యారు. పోలియో నియంత్రణలో భాగంగా పిల్లల్లో జ్వరంతోపాటు దద్దుర్లు కనిపించినా, శరీరంలో ఏ భాగమైనా పాక్షికంగా బలహీనపడినట్లు గుర్తించినా వెంటనే వివరాలు అందజేయాలన్నారు. నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపిస్తామని, పాజిటివ్ నిర్ధారణ అయితే నియంత్రణ చర్యలు చేపడతామన్నారు. ఈనెల 28న నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని కోరా రు. డీఐవో సంపత్‌కుమార్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్ ఉన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ విద్యార్థులకు డిజిటల్ పరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌పై విద్యార్థులకు శిక్షణనిచ్చారు. విద్యార్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయలక్ష్మి సూచించారు. నోడల్ ఆఫీసర్లుగా శ్రవణ్‌కుమార్, ఆది విష్ణు, మహేశ్ వ్యవహరిస్తున్నారు. వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్, అధ్యాపకులు ఆంజనేయులు, ధర్మపురి, వాణి, భిక్షమయ్య, మనోహర్, శ్రీనివాస్, సుచరణ్, కృష్ణప్రసాద్, శంకర్, దీపిక, భార్గవి పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: 17వ బెటాలియన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఏడీజీపీ) సంజయ్‌కుమార్ జైన్ పేర్కొన్నారు. సర్ధాపూర్‌లోని 17వ బెటాలియన్‌లో నిర్మించిన ఫోర్ట్‌వాల్, నార్త్ ఈస్ట్‌గేట్, యూనిట్ జిమ్‌లను బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. బెటాలియన్ కమాండెంట్ ఎం.ఐ.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
చందుర్తి(వేములవాడ): ధాన్యం కుంభకోణంపై పారదర్శక విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు డిమాండ్ చేశారు. మండలంలోని సనుగులలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. గోదాం నుంచి పక్కదారిపట్టిన 13 లారీల ధాన్యంతోపాటు కోనరావుపేట మండలం మర్రిమడ్లలో రైతుల నుంచి సేకరించి తీసుకెళ్లిన లారీ ధాన్యం ఏమైందో అధికారులు స్పష్టం చేయలేదన్నారు. ప్రజాధనాన్ని లూటీచేసిన అక్రమార్కుల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. బీజేపీ మండల అధ్యక్షుడు మోకిలే విజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు మార్త సత్తయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పొంచెట్టి రాకేశ్, గడిగొప్పుల జీవన్, మర్రి రాజు, రంజిత్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
రెగ్యులర్ ఆఫీసర్‌ను నియమించాలి
సిరిసిల్లటౌన్: ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు రెగ్యులర్ ఆఫీసర్‌ను నియమించాలని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్‌రావు కోరారు. ఈమేరకు బుధవారం పోర్టు పోలియో జడ్డి తుకారాంని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత న్యాయవాదుల సమస్యలను వివరించారు.


