సిరిసిల్లటౌన్: పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో మరింత రాణించాలంటే వృత్తి నైపుణ్యం కోసం జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే ఆదేశాలతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా మూడోస్థాయి పోలీస్ డ్యూటీ మీట్–2026 కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. నేర దర్యాప్తు, శాసీ్త్రయ ఆధారాల సేకరణ, కేసుల ఛేదన, ప్రజాభద్రత పరిరక్షణ వంటి అంశాల్లో నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆధునిక దర్యాప్తు పద్ధతులు, ఫోరెన్సిక్ సాంకేతికతలు, నేర పరిశోధనలో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన పెంచేందుకు డ్యూటీమీట్ గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. ఈ డ్యూటీమీట్‌లో కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ ట్రాకింగ్, ఎక్స్‌ప్లోజివ్స్, యాంటీ–సబోటేజ్ చెకింగ్, కంప్యూటర్ అవగాహన, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రవి, నాగేశ్వరరావు, రవీందర్, వెంకటేశ్, ఆర్‌ఐ సురేష్ పాల్గొన్నారు.
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు
తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాంటీ–డ్రగ్ అవేర్‌నెస్ వారోత్సవాలను జిల్లా పోలీస్ శాఖ నిర్వహిస్తుంది. పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.


