వేములవాడ: వేములవాడలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు న్యాయశాఖ కార్యదర్శి బి.పాపిరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడలో కోర్టు ఏర్పాటుతో పెరుగుతున్న కేసుల భారం తగ్గడంతో పాటు ప్రజలకు న్యాయసేవలు మరింత వేగంగా అందే అవకాశం ఏర్పడనుంది. దీంతో వేములవాడ అడ్వకేట్లు కోర్టు ఆవరణలో మంగళవారం స్వీట్లు పంచుకుని వేడుక జరుపుకున్నారు. కార్యక్రమంలో అడ్వకేట్లు నాగుల సత్యనారాయణ, వేముల సుధాకర్‌రెడ్డి, పెంట రాజు, పొత్తూరి అనిల్‌కుమార్, కిశోర్‌రావు, నక్క దివాకర్, నాగుల సంపత్, పర్లపెల్లి అంజయ్య, అభిలాష్, సుంకపాక నవీన్ తదితరులు పాల్గొన్నారు.


