నేను లోకల్‌నయ్యా అన్నా పైసలిస్తేనే కొబ్బరికాయ కొడుతుండ్రు. క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్వాజా ముందుకు రాగానే ఇద్దరు వ్యక్తులు నిలబడి కొబ్బరికాయ కొట్టేందుకు రూ.10 వసూలు చేస్తున్నారు. డబ్బులివ్వని వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – మహేశ్, స్థానికుడు
భక్తులు ఎక్కడా డబ్బులు ఇవ్వొద్దని బోర్డులు రాసి ఉంచాం. మైక్ ద్వారా అనౌన్స్‌మెంట్ చేయిస్తున్నాం. అయినప్పటికీ కొంత మంది డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే ఫిర్యాదు చేయండి. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – రమాదేవి, ఆలయ ఈవో


