వన్యప్రాణులను సంరక్షించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులను సంరక్షించుకోవాలి

Jun 24 2026 8:34 AM | Updated on Jun 24 2026 8:34 AM

వన్యప్రాణులను సంరక్షించుకోవాలి

సిరిసిల్లఅర్బన్‌: పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వన్యప్రాణుల పాత్ర కీలకమని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని 17వ బెటాలియన్‌ కమాండెంట్‌ ఎంఐ సురేశ్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్ధాపూర్‌ 17వ బెటాలియన్‌లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌ లైఫ్‌ స్టడీస్‌(సీడబ్ల్యూఎస్‌) సంస్థ సౌజన్యంతో బెటాలియన్‌ సిబ్బందికి వన్యప్రాణుల సంరక్షణ, మానవ–వన్యప్రాణుల ఘర్షణల నివారణ, జూనోటిక్‌ (జంతువుల నుంచి వ్యాపించే) వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడవుల అంచున, సమీప ప్రాంతాల్లో విధులు నిర్వహించే రక్షక దళాలు, బెటాలియన్‌ సిబ్బంది వన్యప్రాణుల పట్ల ఎలా వ్యవహరించాలో వివరించారు. వన్యప్రాణులు జనారణ్యంలోకి వచ్చినప్పుడు, వాటి దాడి నుంచి ఎలా రక్షణ పొందాలో డిజిటల్‌ ప్రదర్శనల ద్వారా వివరించారు. సంస్థ ప్రతినిధులు, బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాందాస్‌, సురేశ్‌, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

ముఖర్జీ అన్ని తరాలకు ఆదర్శం

సిరిసిల్లటౌన్‌/సిరిసిల్లఅర్బన్‌: భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ జీవితం అన్ని తరాలకు ఆదర్శమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ అన్నారు. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ సందర్భంగా మంగళవారం పట్టణంలోని బీజేపీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశ ప్రయోజనాల కోసం చేసిన పోరాటం నేటి త రాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర కౌ న్సిల్‌ సభ్యులు మాన్య రాంప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, పట్టణ అధ్యక్షుడు దుమా ల శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి కొండ నరేశ్‌, నాయకులు గజబింకర్‌ చందు, ఉరవగొండ రాజు, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి

సిరిసిల్లటౌన్‌: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ లోపల్లి రాజురావు డిమాండ్‌ చేశారు. మంగళవారం సిరిసిల్ల జిల్లాకేంద్రంలో పాఠశాలల బంద్‌ కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహా లు, గురుకుల విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కరించాలని కోరారు. ప్రైవేట్‌, కా ర్పొరేట్‌ విద్యాసంస్థల దోపిడీని అరికట్టా లని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని కోరారు. ఏబీవీపీ టౌన్‌ సెక్రెటరీ ధనుష్‌, పెన్యాల శివ, ఇనగందుల శ్రీనివాస్‌, సాయి, తేజ, కార్యకర్తలు పాల్గొన్నారు.

25న మినీ జాబ్‌మేళా

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈనెల 25న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్‌ కాపీలతో కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8333059105, 8500818717, 7382794374లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

సిరిసిల్లటౌన్‌: విద్యార్థులు, యువత మత్తు ప దార్థాలకు దూరంగా ఉండాలని లోక్‌ అదాలత్‌ జిల్లా మెంబర్‌ చింతోజు భాస్కర్‌ అన్నారు. జిల్లా జడ్జి, లోక్‌ అదాలత్‌ కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జిల్లా న్యాయ సేవాసమితి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. విద్య, క్రీడలు, సాహి త్య, సాంస్కృతిక కార్యక్రమాలపై మక్కువు పె ంచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్‌ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. న్యాయవాదులు వేణు, ఆంజనేయులు,కళ్యా ణి, భూమేశ్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement