సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయ–2026 పురస్కారాల్లో సిరిసిల్లలోని నెహ్రూనగర్ ప్రాథమిక పాఠశాల ఎంపికై ంది. రాష్ట్రం నుంచి పది పాఠశాలలు ఎంపిక కాగా అందులో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జాతీయస్థాయి గుర్తింపు పొందిన ఏకై క పాఠశాలగా అవార్డు సాధించింది. ఈసందర్బంగా హెచ్‌ఎం వాసాల హరిప్రసాద్ మాట్లాడుతూ ఏటా కేంద్ర ప్రభుత్వం పాఠశాలల్లో తాగునీటి, శౌచాలయాల నిర్వహణ, హ్యాండ్ వాష్, పరిసరాల పరిశుభ్రత, ఇంకుడు గుంతలు, తడి పొడి చెత్త నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఈ పాఠశాలకు జాతీయస్థాయి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, రిటైర్డ్ హెచ్‌ఎం, విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, స్కావెంజర్, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.


