గురుకుల విద్యార్థినికి సీఎం అభినందనలు | - | Sakshi
Sakshi News home page

గురుకుల విద్యార్థినికి సీఎం అభినందనలు

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

గురుకుల విద్యార్థినికి సీఎం అభినందనలు కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి ప్రీ ప్రైమరీ స్కూళ్లలో నాణ్యమైన విద్య ● డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలోకి సర్పంచ్‌ కూతురు

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ఇల్లంతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని మాందాడి హనీ శుక్రవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రూ.25వేల చెక్కును అందుకుంది. హనీ 10వ తరగతిలో 586 మార్కులు సాధించి రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సొసైటీలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థినిని సీఎం అభినందించారని ప్రిన్సిపాల్‌ సంధ్యారాణి తెలిపారు.

వేములవాడరూరల్‌: మున్సిపల్‌ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలని చేపట్టిన దీక్ష శుక్రవారం 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్మికులకు సంఘీభావం తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్ర తాప రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలనే కా ర్మికులు అడుగుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్ర భుత్వం స్పందించాలని కోరారు. యూనియన్‌ రాష్ట్ర నాయకుడు గుర్రం అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్‌, నాయకులు వంగల శ్రీనివాస్‌, కొండ్లెపు ముత్యం, నామాల శేఖర్‌, యూనియన్‌ పట్టణ అధ్యక్షుడు సరిపెల్లి నరేశ్‌, దుబ్బల లచ్చయ్య, బొట్టు శ్రీనివాస్‌, సావనపల్లి శ్రీనివాస్‌, గుడిసె రాజయ్య, గాజుల వజ్రమ్మ, వావిలాల లక్ష్మి, పెంట భారతి, రాధ, మమత పాల్గొన్నారు.

బోయినపల్లి(చొప్పదండి): గ్రామాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసిందని డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కొదురుపాక, బోయినపల్లి, గుండన్నపల్లి, కోరెం గ్రామాల్లో శుక్రవారం ప్రీ ప్రైమరీ స్కూళ్లను స్థానిక హైస్కూళ్లలో ప్రారంభించారు. ఎంఈవో శ్రవణ్‌కుమార్‌, సర్పంచులు నల్లమోహన్‌, కొప్పుల లావణ్య, జంపుక మాధవి, కత్తెరపాక మంజుల పాల్గొన్నారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని నామాపూర్‌ సర్పంచ్‌ మాదాసు అనిల్‌ తన కూతురు అభిజ్ఞను స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో శుక్రవా రం చేర్పించారు. ఏడో తరగతి వరకు ముస్తాబాద్‌లోని ప్రైవేటు స్కూల్‌లో చదువుకోగా.. ఎనిమిదో తరగతికి గ్రామంలోని హైస్కూల్‌లో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలపై విశ్వాసం, నమ్మకంతో తన కూతురును చేర్పించిన అనిల్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.

అప్రమత్తంగా ఉండాలి

సిరిసిల్ల అర్బన్‌: అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్‌ సూచించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం ఫైర్‌ సేఫ్టీపై అవగాహన కల్పించారు. స్కూల్‌ బస్సుల్లో ఏర్పాటు చేసే ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌ వినియోగ విధానం, అత్యవసర ద్వారాల ద్వారా సురక్షితంగా బయటకు వెళ్లే పద్ధతులపై ప్రదర్శన నిర్వహించారు. మోటారు వాహనాల తనిఖీ అధికారి గంధం వంశీధర్‌, సహాయ అధికారి పృథ్వీరాజ్‌వర్మ, ఫైర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్మెట నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement