విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

ఎల్లారెడ్డిపేట: గంభీరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని నాలుగు మండలాల్లో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఫోరం చైర్‌పర్సన్‌ జేఆర్‌ చవాన్‌, ఎస్‌ఈ టి.వేణుమాధవ్‌, డీఈ అంజ య్య, ఏవో అరవింద్‌ తెలిపారు. గురువారం ఎల్లారెడ్డిపేటలోని సాధు వెంకట్‌రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో నా లుగు మండలాల రైతులు, వినియోగదారులు, ప్ర జాప్రతినిధులతో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. సదస్సులో వచ్చిన 22 వినతులతో పాటు ఇతర సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఫైనాన్స్‌ మెంబర్‌ సత్యనారాయణ, ఏడీఈ శ్రీనివాస్‌, ఏఈలు రాకేష్‌ రెడ్డి, విష్ణు, రమేశ్‌, ఆనంద్‌, పలువురు సర్పంచులు, రైతులు, విద్యుత్‌ వినియోగదారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌ పనులు పరిశీలన

చందుర్తి: ఎన్గర్‌లో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులను విద్యుత్‌ ఎస్‌ఈ టి.వేణుమాధవ్‌, డీఈ వెంకటరాములు గురువారం పరిశీలించారు. సబ్‌స్టేషన్‌ విద్యుత్‌ లైన్‌ వర్క్‌ ఎక్కడి వరకు పూర్తి చేశారో అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. వర్షాలు కురిస్తే పనులు చేయడం కష్టమవుతోందన్నారు. వీరి వెంట విద్యుత్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement