వేములవాడ: పంచాయతీ కార్మికుల సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ వేములవాడలోని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం ఎదుట కార్మికులు బుధవారం ఆందోళన చేపట్టారు. ముందుగా తెలంగాణచౌక్ నుంచి ఊరేగింపుగా ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని బైఠాయించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర శ్రీనివాస్, అన్నల్‌దాస్ గణేశ్ మాడుతూ మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


