బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మారుమూల గ్రామాలకూ ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి వయా మల్కాపూర్, గంగాధర మీదుగా వేములవాడకు వెళ్లే ఆర్టీసీ బస్సును బుధవారం ప్రారంభించి, అందులో ప్రయాణించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్‌యాదవ్, వేములవాడ ఆర్టీసీ డీఎం బోనాల శ్రీనివాస్, సర్పంచులు మడ్లపల్లి తులసి గంగయ్య, మహేశ్‌రెడ్డి, నల్ల మోహన్, ఏనుగుల కనకయ్య పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయ అ ధికారి అఫ్జల్‌బేగం బుధవారం తనిఖీ చేశా రు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను పరిశీలించారు. మరో రెండు రోజుల్లో ‘యూరియా యాప్’ ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా షాపుల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చే యాలని సూచించారు. యాప్ వినియోగం, ఎరువుల కొనుగోలుపై రైతులకు సందేహా లుంటే 18001237157 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. మండల వ్యవసాయాధికారి సంజీవ్ పాల్గొన్నారు.
అర్హులకు డబుల్ ఇళ్లు అందించాలి
సిరిసిల్లటౌన్: ఇప్పటికే నిర్మించిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ కోరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో బుధవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ప దేళ్ల క్రితం గత ప్రభుత్వం పేదల కోసం డ బుల్ బెడ్‌రూమ్ పథకం ప్రవేశపెట్టిందన్నా రు. కానీ అనర్హులకు అందించారని ఆరోపించారు. ఈ విషయంపై గత ప్రభుత్వ హ యాంలో అనేకసార్లు పోరాటాలు చేసినా ప ట్టించుకోలేదన్నారు. శాంతినగర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. మిట్టపల్లి రాజమల్లు, దాసరి రూప, బిజిగం సురేశ్, జిందం కమలాకర్, నాగుల సత్యం, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు.
అనర్హులను తొలగించాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించాలని సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు సూచించారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్‌లోని రైతువేదికలో బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణపై బీఎల్వోలు, సూపర్‌వైజర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈనెల 25 నుంచి అనర్హుల తొలగింపుపై సర్వే చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దార్లు సుజాత, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
చందుర్తి(వేములవాడ): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)ను పకడ్బందీగా చేపట్టాలని వేములవాడ ఆర్డీవో కుమారి కోరారు. చందుర్తి రైతువేదికలో బుధవారం బీఎల్వోలకు నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. అర్హుల పేరును ఓటరు జాబితాలో చేర్చాలని, మృతులు, శాశ్వత వలసదారులు, ఒకటికి మించి ఎక్కువ ఓట్లు ఉన్నవారిని తొలగించాలని సూచించారు. బూత్‌ఈ్థయి అధికారులు చేపట్టే ఈ ఇంటింటీ సర్వే పారదర్శకంగా చేయాలన్నారు. చందుర్తి, రుద్రంగి తహసీల్దార్లు భూపతి, పుష్పలత, ఆర్‌ఐ శ్రీనివాస్ ఉన్నారు.


