ప్రభుత్వ వైద్యం..పేదలకు దూరం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యం..పేదలకు దూరం

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

● ఆదివారం వైద్యులకు సెలవు ● ఫోన్‌లోనే సూచనలు ఇస్తున్న డాక్టర్లు ● ఏఎన్‌ఎంలతోనే సేవలు ● వసతుల లేమితో ఇబ్బంది

● ఆదివారం వైద్యులకు సెలవు ● ఫోన్‌లోనే సూచనలు ఇస్తున్న డాక్టర్లు ● ఏఎన్‌ఎంలతోనే సేవలు ● వసతుల లేమితో ఇబ్బంది

సిరిసిల్లటౌన్‌: జిల్లాలో సర్కారు వైద్యం పేదలకు అందనంత దూరంలో ఉంది. అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలలో పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించాలన్న సర్కారు లక్ష్యం సిబ్బంది నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. మౌలిక వసతుల లేమి, సిబ్బంది, మందుల కొరత రోగుల పాలిట శాపంగా మారాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆదివారం అందుతున్న వైద్యసేవలపై ‘సాక్షి’ విజిట్‌లో పలు విషయాలు వెలుగుచూశాయి. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, సహాయక సిబ్బంది గైర్హాజరయ్యారు. కొన్నింటికి తాళం వేసి ఉండగా.. మరికొన్నింటిలో ఒకరిద్దరు మాత్రమే విధులు నిర్వర్తించారు. కొన్నింటిలో సహాయక వైద్యసిబ్బంది కూడా రాకపోవడంతో ఆఫీస్‌ సబార్డినేట్లు కేంద్రాలను మూసివేసి వెళ్లిపోయారు.

మీరు చూస్తున్న ఈ ఫొటో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌ అర్బన్‌హెల్త్‌ సెంటర్‌. ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు తెరవాల్సిన దవాఖానా ఆదివారం ఉదయం 10 గంటలు దాటినా తాళం తీయలేదు. అప్పటికే పలువురు రోగులు వచ్చి తాళం వేసి ఉండడంతో తిరిగివెళ్లిపోయారు. సిరిసిల్లలోని రెండు అర్బన్‌హెల్త్‌ సెంటర్లలో నిత్యం 200 మంది రోగులు వస్తుంటారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించడం లేదు.

జిల్లాలో ఆరోగ్య సేవల ప్రొఫైల్‌

అర్బన్‌హెల్త్‌ సెంటర్లు 02

బస్తీ దవాఖానాలు 02

పీహెచ్‌సీలు 13

యూపీఎస్సీలు 03

ఏరియా ఆస్పత్రి 01

జనరల్‌ ఆస్పత్రి 01

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement