కోనరావుపేట(వేములవాడ): మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో వైద్యులు రాలేదు. ఫోన్‌లోనే వైద్యసేవలు అందిస్తున్నారు. సిబ్బంది వంతులవారీగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏఎన్‌ఎం సునంద ఒక్కరే హాజరయ్యారు. నిమ్మపల్లికి చెందిన రాపెల్లి సాయికుమార్ కోతి కరిచిందని, మరిమడ్లకు చెందిన కడకుంట్ల లక్ష్మి కుక్క కరిచిందని ఆస్పత్రికి రాగా వైధ్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఏఎన్‌ఎం డాక్టర్‌కు ఫోన్ చేసి ఆయన సూచనల మేరకు వైద్యం చేసింది. వీరితోపాటు మరో 9 మందిరాగా ఫోన్‌లో డాక్టర్ సూచనలతో మందులు అందజేశారు. ప్రతీ ఆదివారం వైద్యులు అందుబాటులో ఉండడం లేదని రోగులు తెలిపారు.


