● కలెక్టర్ గరీమా అగ్రవాల్
గంభీరావుపేట(సిరిసిల్ల): రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రోగులతో మాట్లాడి వై ద్యసేవలపై ఆరా తీశారు. ఇన్‌పేషెంట్ వార్డులు, మందులు ఇచ్చే గది, స్టోర్‌రూమ్, వ్యాక్సినేషన్, యునాని హాస్పిటల్, ఆస్పత్రి ఆవరణ పరిశీలించారు. హాస్పిటల్ ఆవరణ శుభ్రంగా ఉండాలని ఎంపీడీవోకు సూచించారు. అవసరమైన మరమ్మతులు చేయించాలని అ ధికారులను ఆదేశించారు. వైద్యులు, సి బ్బంది అందుబాటులో ఉండాలని, మె రుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ప్రభుత్వ వైద్యసేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్‌కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, డీసీహెచ్‌ఎస్ రవీందర్, సర్పంచ్ మల్లుగారి పద్మ, ఉపసర్పంచ్ కమలాకర్‌రెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, వైద్యాధికారి సృజన్ ఉన్నారు.
బాధితుల వద్దకే పోలీసులు
సిరిసిల్ల క్రైం: వేగవంతమైన, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సంఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ‘ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్’ విధానాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. నేరం జరిగిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు స్టేషన్‌కు వెళ్లడం భారంగా మారకుండా ఉండేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచే ఫిర్యాదు స్వీకరించి, ట్యాబ్‌ల సహాయంతో ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్నారు. డయల్ 100కు కాల్ చేసినా, నేరుగా సమాచారం ఇచ్చినా తక్షణమే స్పందిస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే ఈ విధానం ద్వారా జిల్లాలో 12 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.


