చిరు వ్యాపారులు ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా పలురకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధంతో వంట గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటళ్లు, హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. ముస్తాబాద్‌లోని పలు హోటళ్లలో కట్టెలపొయ్యి మిషన్‌కు కరెంట్ కనెక్షన్ ఇచ్చి అల్పాహారం, టీ తయారు చేస్తున్నారు. కట్టెల పొయ్యికి గాలి వచ్చేలా కరెంట్ కనెక్షన్ ఇస్తున్నారు. దీంతో సులభంగా కావాల్సినంత మంట వస్తుందని నిర్వాహకులు తెలిపారు. తక్కువ ధరకే కట్టెలు, మిషన్ లభిస్తున్నాయని పేర్కొన్నారు. – ముస్తాబాద్(సిరిసిల్ల)


