ప్రతి మహిళ 20 మందికి అండగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి మహిళ 20 మందికి అండగా నిలవాలి

Mar 18 2026 7:43 AM | Updated on Mar 18 2026 7:43 AM

సిరిసిల్ల: మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్‌ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్‌ మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ మహిళ కనీసం 20 మంది మహిళలకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. తాము విధులు నిర్వర్తించే చోట, పరిసర ప్రాంతాల వారికి ఆపద సమయంలో భరోసా ఇవ్వాలన్నారు.

వందశాతం పన్ను వసూలు చేయాలి

సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ పరిధిలో ఇంటి, భవనాల పన్ను వంద శాతం వసూలు చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. సిరిసిల్లలో పన్ను వసూలు లక్ష్యం రూ.6.99కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.5.66కోట్లు, వేములవాడలో రూ.4.54 కోట్లు లక్ష్యం కాగా, రూ.3.18 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు వివరించారు. అలాగే జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై కలెక్టర్‌ సమీక్షించారు. గ్రామ సమాఖ్య, అంగన్వాడీ భవనాల పనులను పూర్తి చేయాలన్నారు.

లబ్ధిదారుల ఎంపిక

మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా శ్రీరేవంతన్నా కా సహారా– మిస్కీన్‌లశ్రీ పథకం ద్వారా ఫకీర్‌, దూదేకుల ముస్లిం కమ్యూనిటీ అభ్యున్నతికి జిల్లాకు కేటాయించిన ఈ–బైక్‌ల ఎంపిక కోసం కలెక్టర్‌ లక్కీ డీప్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్‌, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో గీత, డీఏవో అఫ్జల్‌ బేగం, మత్స్య శాఖ అధికారి సౌజన్య, డీఎంహెచ్‌వో రజిత, మైనార్టీ అధికారి భారతి, ఎస్సీ సంక్షేమ అధికారి స్వప్న, జిల్లా ఆడిట్‌ అధికారి శ్రీనివాస్‌, హౌసింగ్‌ పీడీ వెంకటమాధవరావు, డీవీహెచ్‌వో రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్‌, ఐఎంఏ డాక్టర్లు శోభారాణి, శిరీష తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement