సిరిసిల్లటౌన్: సమాజహితమే లక్ష్యంగా సాహిత్యం స్వచ్ఛమైన గంగా ప్రవాహమై నిరంతరం కొనసాగాలని డీఎస్పీ నాగేంద్రచారి ఆకాంక్షించారు. సిరిసిల్ల సాహితీ సమితి, మానేరు స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా మంగళవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌లోని భక్త విఠలేశ్వర హనుమాన్ ఆలయంలో జరిగిన కవి సమ్మేళనానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజ హితమే లక్ష్యంగా కవితలు, రచనలతో భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. సమాజానికి దిశానిర్దేశం చూపేది కవులు, రచయితలేనని పేర్కొన్నారు. సమ్మేళనంలో డీఎస్పీతో పాటు కవులను సన్మానించారు. కార్యక్రమంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డాక్టర్ చింతోజు భాస్కర్, సిరిసిల్ల సాహితీ సమితి గౌరవ అధ్యక్షుడు పోరండ్ల మురళీధర్, వెంగళ లక్ష్మణ్, నేరోజు రమేశ్, ఆడెపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


