● అసెంబ్లీలో విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని, ప్రజా ప్రభుత్వంలో రైతులకు భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రైతు భరోసా, పనిముట్లు, సన్నాలకు బోనస్ ఇస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యాన్ని పశువులకు దాణాగా వేసేవారని, ప్రస్తుతం ఇస్తున్న సన్నబియ్యాన్ని ప్రతీ ఒక్కరూ తింటున్నారని అన్నారు. నాడు డబుల్‌బెడ్ రూమ్ పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని, ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగా 600 బస్సులను సంఘాలకు కేటాయించామన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, ప్రజాభవన్‌లో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు.


