తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాకు చెందిన ప్రముఖ గాయకురాలు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కత్తి స్వరూపరాణి జాతీయస్థాయి గుర్తింపు పొందారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు ఆమె ఎంపికై నట్లు ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ (వరంగల్) అధ్యక్షుడు శ్రీధరస్వామి తెలిపారు. ఇటీవల శ్రీఅఖిల భారత సివిల్ సర్వీసెస్ సంగీతం, నృత్యం, నాటక పోటీల్లో ప్రతిభ చాటారు. జానపద బృంద గానం విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఆమెను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. స్వరూపరాణి ప్రస్తుతం తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఢిల్లీ వేదికపై కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రేడియో, టీవీ గాయకుడు కాసు మహేందర్‌రాజ్ బృందంతో కలిసి ఆమె తన గానాన్ని వినిపించనున్నారు. ఈసందర్భంగా స్వరూపరాణి, ఆమె బృందాన్ని ఎంఈవో రాజునాయక్, ఉపాధ్యాయులు అభినందించారు.


