పశ్చిమాసియలో యుద్ధం.. మన ప్రాంతంపై తీవ్ర ప్రభావం
కమర్షియల్ వంటగ్యాస్‌కు కొరత
మూతపడుతున్న టిఫిన్ సెంటర్లు
హోటళ్లలో పెరిగిన ధరలు
భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు
చమురు
సిరిసిల్లటౌన్: అమెరికా, ఇజ్రాయేల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం ప్రభావం మన ప్రాంతంపై తీవ్రంగా పడుతుంది. పక్షం రోజులుగా సాగుతున్న యుద్ధంతో ప్రధానంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరతతో టిఫిన్స్, బిర్యానితోపాటు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా బుకింగ్ చేసుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం ప్రభావంతో జిల్లాలో మారిన పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.
ఎగబాకుతున్న ధరలు
నాలుగైదు రోజులుగా గ్యాస్ కొరతతో ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరతతో పలు హోటళ్లలో కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నారు. వంట తయారీకి పెరిగిన ఖర్చును వినియోగదారులపై వేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే కోడిగుడ్ల ధరలు పడిపోతున్నాయి. ఎక్స్‌పోర్టు లేక పౌల్ట్రీలలో కోడిగుడ్ల నిల్వలు పెరిగి ధరలు తగ్గుతున్నాయి.
క్లోజ్.. గ్యాస్ లేక మూతపడ్డ కర్రీ పాయింట్
నో స్టాక్.. సిరిసిల్లలో మూసి ఉన్న గ్యాస్ ఏజెన్సీ


