మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు గతంలో మాదిరిగా విరివిగా దొరకడం లేదు. ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ బ్లాక్ చేసి కొరత సృష్టిస్తున్నారు. గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి నిర్వహణ భారమైంది. గతంలో కమర్షియల్ సిలిండర్ రూ.1,780 ఉండగా.. ఇప్పుడు రూ.2400కు చేరింది. ఏజెన్సీలో స్టాక్ లేదని చెబుతున్నారు. నెలకు 70 సిలిండర్లు వాడే మేము గత్యంతరం లేక కట్టెలపొయ్యిపై వంట చేస్తున్నాం. ధరలు పెంచడంతో కస్టమర్లతో ఇబ్బంది కలుగుతుంది.
– శ్రీగాథ శ్రీనివాస్, రెస్టారెంట్ నిర్వాహకుడు


