పారిశుధ్య పనులపై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య పనులపై నజర్‌

Mar 17 2026 7:49 AM | Updated on Mar 17 2026 7:49 AM

పారిశుధ్య పనులపై నజర్‌ ● మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ దీక్ష ముగిసిన రైతు రిలే నిరాహార దీక్ష రేడియాలజిస్ట్‌ రెండు ఆస్పత్రుల్లోనే స్కాన్‌ చేయాలి ● జిల్లా వైద్యాధికారి రజిత

● మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు

వేములవాడ: పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక నజర్‌ పెడుతున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు పేర్కొన్నారు. రూ.21.50 లక్షలతో రెండు ట్రాక్టర్లు, వాటర్‌ ట్యాంకర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. మున్సిపల్‌ ఆవరణలో సోమవారం కమిషనర్‌ సంపత్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్లతో కలిసి పూజలు చేశారు. చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. కౌన్సి లర్లు తూం మధు, కొండ రాజశేఖర్‌, టైలర్‌ శ్రీనివాస్‌, తోట రాజు, కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్‌, సిరిగిరి శ్రీకాంత్‌, తిరుపతిరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌, సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సుకుమార్‌ పాల్గొన్నారు.

సిరిసిల్లటౌన్‌: గీతానగర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ దీక్షా దినోత్సవం సోమవారం నిర్వహించారు. 16 మంది స్కౌట్‌, 16 మంది గైడ్స్‌ దీక్ష స్వీకారం చేశారు. పీఎంశ్రీ కార్యక్రమంలో భాగంగా వారికి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ దుస్తులను పంపిణీ చేసినట్లు హెచ్‌ఎం శారద తెలిపారు. అనురాధ, తిరుపతి, గైడ్‌టీచర్‌ కొండికొప్పుల మంజుల, స్కౌట్‌ మాస్టర్‌ తడుకల సురేష్‌ పాల్గొన్నారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): అసంపూర్తి కాలువను పూర్తి చేయాలని కోరుతూ మండలంలోని పెద్దలింగాపూర్‌లో 35 రోజులుగా రైతులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష సోమవారం ముగిసింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్‌కుమార్‌ రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఎల్‌ఎం 6 కాలువ పనులు పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రూ.3.19 కోట్లు మంజూరు చేయించారని, రైతులు దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు.

సిరిసిల్ల: రేడియాలజిస్ట్‌ రెండు ఆస్పత్రులకు మించి స్కాన్‌ పరీక్షలు చేయొద్దని జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లను సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబుతో కలిసి తనిఖీ చేశారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధమన్నారు. డిప్యూటీ డెమో రాజకుమార్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సీ యాక్షన్‌ప్లాన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

సిరిసిల్ల: తెలంగాణ షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి సంఘం ఎస్సీ యాక్షన్‌ ప్లాన్‌ 2025–2026ను విడుదల చేశారు. బ్యాంకు అనుసంధానంతో రవాణారంగంలో వాహనాలు, వ్యవసాయ అనుబంధ వాహనాలు, సోలార్‌ యూనివర్సల్‌ పంపు కంట్రోల్‌ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. 21 నుంచి 50 ఏళ్లలోపు వారు లబ్ధి పొందేందుకు మార్చి 24లోపు దరఖాస్తులు చేసుకోవచ్చని ఎస్సీడీవో అధికారులు కోరారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీ పరిధిలోని షెడ్యూల్డ్‌ కులాల అభ్యర్థులు, వ్యవసాయేతర పథకాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కోరారు. వివరాలకు ఎస్సీడీవో ఆఫీస్‌లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement