‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ లక్ష్యం సాధించాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ లక్ష్యం సాధించాలి

Mar 17 2026 7:49 AM | Updated on Mar 17 2026 7:49 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 6 నుంచి జూన్‌ 12 వరకు 99 రోజులపాటు ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షించారు. జిల్లా అధికారులు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు ముందుకు వెళ్లాలన్నారు. మహిళా సంఘాల భవనాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఆర్డీవోలు సీ.హెచ్‌.వెంకటేశ్వర్లు, రాధాభాయ్‌, హౌసింగ్‌ పీడీ వెంకటమాధవరావు పాల్గొన్నారు.

గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి

పశువుల సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని కలెక్టర్‌ సూచించారు. జాతీయ పశువ్యాధుల నివారణలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జీవాల ఆరోగ్య సంరక్షణకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేయిస్తుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 బృందాలు ఏప్రిల్‌ 9వ తేదీ వరకు టీకాలు వేస్తారని వివరించారు. జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement