ముస్తాబాద్(సిరిసిల్ల): పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి పట్టన్నట్లు వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు అన్నారు. యాసంగికి అవసరమైన నీటిని మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయాలని మోహినికుంట రైతులు ప్రాజెక్టు ఎస్‌ఈకి శనివారం విజ్ఞప్తి చేశారు. గోపాల్‌రావు మాట్లాడుతూ మల్లన్నసాగర్ ద్వారా దుబ్బాక చెరువు, చెల్లాపూర్, రాజక్కపేట చెరువులకు నీటిని విడుదల చేయాలన్నారు. మోహిని కుంట, మద్దికుంట, బందనకల్, సేవాలాల్‌తండా, తెర్లుమద్ది, వెంకట్రావుపల్లె గ్రామాల్లో పంటలు ఎండుతున్నాయన్నారు. సర్పంచ్ బిల్లం మురళీ, శ్రీని వాస్‌రావు, మల్లేశ్, వేణుగోపాల్‌రావు, బాబు, రాజేశం, రాజం, శేఖర్ ఉన్నారు.


