సెల్‌టవర్‌ ఏర్పాటుపై నిరసన | - | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్‌ ఏర్పాటుపై నిరసన

Mar 12 2026 7:12 AM | Updated on Mar 12 2026 7:12 AM

● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నివాసాల మధ్య సెల్‌ టవర్‌ వేయొద్దని కోరుతూ మండలంలోని అల్మాస్‌పూర్‌లో బుధవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తరలివచ్చి ధర్నా చేశారు. సెల్‌టవర్‌ ఏర్పాటు విషయంలో పది రోజులుగా గ్రామస్తులు, నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈనేపథ్యంలో సెల్‌టవర్‌ నిర్వాహకుల ఫిర్యాదుతో గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కారు. అంతేకాకుండా నివాసాల మధ్య సెల్‌టవర్‌ వద్దని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

టీడీపీ ఎంపీల దిష్టిబొమ్మలు దహనం

సిరిసిల్లటౌన్‌: పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన చారిత్రాత్మక రోజును బ్లాక్‌ డేగా పేర్కొంటూ టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ ఖండించారు. ఈమేరకు సిరిసిల్లలోని చేనేతచౌక్‌ వద్ద టీడీపీ ఎంపీల దిష్టిబొమ్మలను దహనం చేసి మాట్లాడారు. అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా టీడీపీ ఎంపీలు మాట్లాడడం శోచనీయమన్నారు. మట్టి శ్రీనివాస్‌, అఫ్రోజ్‌, వడ్లూరి వేణు, అజ్జు, విష్ణు, రాము, నవీన్‌, శ్రీనివాస్‌, రాజేశ్‌ పాల్గొన్నారు.

మార్కెట్‌ యార్డులో రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

వేములవాడరూరల్‌: స్థానిక మార్కెట్‌యార్డులో ఖాళీగా ఉన్న భవనాన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ఇచ్చేందుకు మార్కెట్‌ పాలకవర్గం తీర్మానించింది. మార్కెట్‌ చైర్మన్‌ రొండి రాజు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి హాజరైన మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజును మార్కెట్‌ పాలకవర్గం సన్మానించింది. మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సత్యనారాయణ, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ కనికరపు రాకేశ్‌, డైరెక్టర్లు రాగిరి నాగరాజు, ఖమ్మం గణేశ్‌, పాలకుర్తి పర్శరాములు, వస్తాద్‌ కృష్ణ, మానుపాటి పర్శరాం, ఎస్‌.కె.సాబీర్‌, మ్యాక స్రవంతి, కత్తి కనకయ్య, చెరుకు శంకర్‌, గుర్రం విద్యాసాగర్‌, చీకోటి నాగరాజు పాల్గొన్నారు.

మహిళా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

బోయినపల్లి(చొప్పదండి): ప్రజాప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండల కేంద్రంలో ధరిత్రి, శ్రీలక్ష్మీ తులసి మహిళా సంఘం భవన నిర్మాణాలకు, బూర్గుపల్లిలో సీసీ రోడ్డు పనులకు బుధవారం భూమిపూజ చేశారు. రూ.45 కోట్ల మేర వడ్డీలేని రుణాలు, ఈజీఎస్‌ క్యాటిల్‌షెడ్‌, పౌల్ట్రీఫామ్‌ లబ్ధిదారులకు చెక్కులు, దివ్యాంగుడు దేవరాజుకు స్కూటీ పంపిణీ చేశారు. డీఆర్డీవో మచ్చ గీత, ఏఎంసీ చైర్మన్‌ ఎల్లేశ్‌యాదవ్‌, పీఆర్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో జయశీల, డీఈ విష్ణువర్ధన్‌, ఏవో ప్రణిత, వీసీ వినోద్‌రెడ్డి, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రమణారెడ్డి, మహేశ్‌రెడ్డి, సర్పంచులు నల్ల మోహన్‌, ఏనుగుల కనకయ్య, పెంచాల సౌమ్య, జంగం అంజయ్య, సుద్దాల మధు, కౌడగాని వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement