డిజిటల్‌ విధానంలో జనగణన | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ విధానంలో జనగణన

Mar 12 2026 7:12 AM | Updated on Mar 12 2026 7:12 AM

రెండు దశల్లో కార్యక్రమం

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: జిల్లాలో జనగణన–2027ను డిజిటల్‌ విధానంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అఽఽధికారులను ఆదేశించారు. జనగణన–2027పై సెన్సస్‌ ఫర్‌ వెల్ఫేర్‌ పేరిట ఈనెల 11 నుంచి 13 వరకు కలెక్టరేట్‌లో చార్జ్‌ ఆఫీసర్లు, అదనపు చార్జ్‌ ఆఫీసర్లకు శిక్షణను బుధవారం ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సెన్సస్‌ చట్టం 1948 ప్రకారం ప్రభుత్వం జనగణన చేపడుతుందన్నారు. చార్జ్‌ ఆఫీసర్లుగా మున్సిపాలిటీలో కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లు, అదనపు చార్జ్‌ ఆఫీసర్లుగా ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్యూమరేటర్‌, సూపర్‌వైజర్లుగా ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. ఐదుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌ వైజర్‌, ప్రతీ మండలానికి ఒక టెక్నికల్‌ సహాయకులు ఉండాలన్నారు. ఈ విధానంలో ప్రజలే తమ వివరాలు పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకునే సదుపాయం ఉందన్నారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్‌ 9 వరకు గృహాల గణన చేపడతారని, రెండోదశ ఫిబ్రవరి–2027లో వ్యక్తుల వారీగా సమాచారం సేకరిస్తారని తెలిపారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, జిల్లా ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి షర్ఫొద్దీన్‌, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement