● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ
ఇల్లంతకుంట(మానకొండూర్): కాళేశ్వరం ప్రాజెక్టు 11/6 అసంపూర్తి కాలువ పనులకు రూ.3.19 కోట్లు త్వరలో మంజూరు చేస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. రైతుల నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి బుధవారం డిప్యూటీ సీఎంను కలిసి సమస్యను వివరించారు. పార్టీ మండలాధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి, నాయకులు ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, గుడిసె ఐలయ్య, పాశం రాజేందర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పసుల వెంకటి, రైతులు గాదె మధు, కమటం రవి, అశోక్‌యాదవ్ పాల్గొన్నారు.
17న రైల్వే భూ నిర్వాసితుల సమావేశం
వేములవాడ: రైల్వేలైన్ భూనిర్వాసితులతో ఈనెల 17న సమావేశం నిర్వహిస్తున్నట్లు వేములవాడ అర్బన్ తహసీల్దార్ జయంత్‌కుమార్ బుధవారం తెలిపారు. 12న నిర్వహించాల్సిన సమావేశం ఉన్నతాధికారుల సూచనతో 17కు వాయిదా వేసినట్లు తెలిపారు. వేములవాడ పట్టణంతోపాటు నాంపల్లి, శాత్రాజుపల్లి ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు గమనించి నోటీసులు అందుకున్న వారు అభ్యంతరాలుంటే సమావేశంలో తెలపాలన్నారు.
నీరా కేఫ్ నిర్వహణకు
టెండర్లు ఆహ్వానం
సిరిసిల్లటౌన్: హైదరాబాద్‌లో నీరా కేఫ్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తునట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య బుధవారం ప్రకటనలో తెలిపారు. గీతా కార్మిక సంఘాల నుంచి టెండర్ ఆహ్వానిస్తునట్లు పేర్కొన్నారు. వివరాలకు www.tgtcfc.com వెబ్‌సైట్ లేదా సమీపంలోని ఎకై ్సజ్ డిపార్టుమెంటులో సంప్రదించాలని సూచించారు.


