సిరిసిల్లటౌన్: సెస్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్.స్వామి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి 72 గంటలు విధులు బహిష్కరించి, నిరవధిక దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ స్వయం ప్రతిపత్తి గల సెస్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన హెల్పర్ల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మానిటరీ బెనిఫిట్స్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాస్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర మల్లేశం, కోశాధికారి రాంబాబు, అనిల్‌కుమార్, శ్రీనివాస్, సత్యం, కిషన్, సతీశ్, మల్లేశ్, వెంకటి, ఎల్లయ్య, శివప్రసాద్, అంజిరెడ్డి, ప్రశాంత్, సంజీవరెడ్డి, శ్రీహరి, పూల్‌సింగ్ పాల్గొన్నారు.


