కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్నసిరిసిల్ల నుంచి చెన్నమనేని వికాస్‌రావుకు అవకాశం దక్కింది. వికాస్‌రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచారు. వైద్యుడిగా నియోజకవర్గ ప్రజలకు మెడికల్ క్యాంపుల ద్వారా సేవలందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి యాదగిరి సునీల్‌రావుకు అవకాశం దక్కింది. సునీల్‌రావు గతంలో మేయర్‌గా, ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా సేవలందిస్తున్నారు. సునీల్‌రావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అన్నపూర్ణమ్మ ఫౌండేషన్‌కు అవార్డు
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని గూడెం అన్నపూర్ణమ్మ ఫౌండేషన్ సభ్యులకు హెలెన్ కెల్లర్ సీ్త్రశక్తి అవార్డును హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం ప్రదానం చేశారు. గత జనవరి 1 నుంచి గూడెంలో యాభై మందికి పైగా వృద్ధులకు నిత్యం రెండు పూటల భోజనం అందిస్తున్నారు. అన్నపూర్ణమ్మ ఫౌండేషన్‌ను స్థాపించి మూడు నెలలుగా వారి బాగోగులు చూసుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఫౌండేషన్ సభ్యులు కుర్ర సావిత్రి, సత్తవ్వ, బొప్ప విజయలక్ష్మి, పద్మలత, విజయ, శోభారాణిని దివ్యాంగ మహిళా సాధికారత అధ్యక్షురాలు కోల రాజ్యలక్ష్మి అభినందించారు.


