● ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన యువకుడు
● కెనాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి
తిమ్మాపూర్: మండలం మన్నెంపల్లి శివారులో ఓ యువకుడు బుధవారం అనుమానాస్పద సి ్థ తిలో మృతిచెందడం కలకలం రేపింది. మల్లాపూర్‌కు చెందిన బనక చందు(30) పొట్టకూటికోసం కొన్నేళ్లుగా దుబాయ్ వెళ్లొస్తున్నాడు. 20 రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చి న ఆయన స్వగ్రామంలోనే స్థిరపడతానని చుట్టుపక్కలవారితో అన్నట్లు సమాచారం. అయితే చందుకు ఓ ఫోన్‌కాల్ వచ్చిన తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. కొంత సమయం తర్వాత మల్లాపూర్–మన్నెంపల్లి శివారులోని డి–4 కెనాల్ వద్ద చందు శవం దొరికింది.
శరీరంపై గాయాలు
చందు శరీరంపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో కొట్టి చంపి కెనాల్‌లో పడేసి ఉంటారంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. వారి ఫిర్యాదుతోకేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. సంఘటన స్థలాన్ని తిమ్మాపూర్ సీఐ సదన్‌కుమార్ పరిశీలించారు.
ఉరేసుకుని ఆత్మహత్య
ఇల్లందకుంట: మండలంలోని గడ్డివానిపల్లికి చెందిన బోయిని వెంకటేశ్(26) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వెంకటేశ్‌కు రెండేళ్ల క్రితం వివాహం కాగా.. భార్య లక్ష్మి, రెండు నెలల కొడుకు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. మానసిక వేదనతో ఇంట్లోని రేకులషెడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
పోక్సో కేసులో 13ఏళ్ల జైలు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలంలోని ఓ గ్రా మానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన గుండు నరేశ్ అనే యువకుడికి 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఫాస్ట్‌ట్రాక్, పోక్సో కోర్టు జడ్జి స్వప్నరాణి బుధవారం తీర్పు ఇచ్చారని సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ విషయమై బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో 2017 జూన్ 29న కేసు నమోదు కాగా అప్పటి ఏసీపీ సింధూశర్మ విచారణ జరిపి నిందితుడు నరేశ్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. న్యాయస్థానంలో ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాక నేరం రుజువు కావడంతో నరేశ్‌కు శిక్ష విధించినట్లు సీఐ వివరించారు. ఇందుకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని రామగుండం పోలీస్ కమిషనర్ అభినందించారు.
మోసానికి పాల్పడ్డ ఇద్దరి రిమాండ్
వేములవాడరూరల్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన గుగులోతు రవిని అల్మేరియాకు పంపిస్తానని మోసం చేసిన ఇద్దరు ఏజెంట్లను రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడరూరల్ ఎస్సై వెంకట్రాజం బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు. మండలంలోని నూకలమర్రికి చెందిన రవిని అల్మేరియాకు పంపిస్తానని జగిత్యాల జిల్లా శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన దండుగుల మల్లేశం, పల్లపు నాంపెల్లి రూ.3లక్షలు తీసుకున్నారు. అల్మేనియాకు పంపించగా.. ముందుగా చెప్పిన పని కాకుండా వేరే పనిలో పెట్టారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రవి స్వగ్రామానికి తిరిగి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


