కనీస వేతనాలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనాలు చెల్లించాలి

Mar 12 2026 7:11 AM | Updated on Mar 12 2026 7:11 AM

జ్యోతినగర్‌(రామగుండం): ప్రభుత్వరంగ సంస్థల్లోని కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడంలో ఆయా యాజమాన్యాలు విఫలమయ్యాయని, ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు, ఐఎన్‌టీయూసీ జాతీయ సీనియర్‌ కార్యదర్శి బాబర్‌ సలీంపాషా డిమాండ్‌ చేశారు. న్యూఢిల్లీలోని క్రౌన్‌ ప్లాజాలో ఐఎన్‌టీయూసీ–ఏషియా పసిఫిక్‌, ఇండస్ట్రియల్‌ గ్లోబల్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడికి గురువుతున్నారని అన్నారు. వారి స్థితిగతులు, సామాజిక భద్రత, పనిపరిస్థితులు, గౌరవప్రదమైన వేతనాలు చెల్లించే విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ట్రేడ్‌ యూనియన్లతో చర్చలు జరపడానికి, కార్మికుల సమస్యలను వినడానికి ఆసక్తి చూపడం లేదని ధ్వజమెత్తారు. కార్మికుల హక్కుల సాధనకు కార్మిక సంఘాలు ఐక్యతను చాటాలని ఆయన కోరారు.

ఐఎన్‌టీయూసీ జాతీయ సీనియర్‌ కార్యదర్శి బాబర్‌ సలీంపాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement