ఇదేం చెత్త పని | - | Sakshi
Sakshi News home page

ఇదేం చెత్త పని

Mar 11 2026 8:35 AM | Updated on Mar 11 2026 8:35 AM

సిరిసిల్ల మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది సేకరించిన చెత్తను డంపుయార్డుకు తరలించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వీధి వీధికి, ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది రగుడు శివారులోని డంపుయార్డుకు తరలించడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సేకరించిన చెత్త అంతా.. రోడ్డుపై గాలికి జారిపోతోంది. దీంతో ప్రధాన రహదారుల్లో మున్సిపల్‌ చెత్త వెదజల్లినట్లు పడుతుంది. తిని పడేసిన ప్లేట్లు, ఇతర చెత్త కవర్లు ట్రాక్టర్‌ వెనక వైపు నుంచి గాలికి కొట్టుకుపోయి పడిపోతున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు ఈ అంశంపై శ్రద్ధ వహించి సేకరించిన చెత్తను జాగ్రత్తగా డంపుయార్డుకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement