సిరిసిల్ల: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 12న మినీ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి నీలం రాఘవేందర్ మంగళవారం తెలిపారు. వీవీసీ మోటార్స్‌లో ఎలక్ట్రికల్ వాహనాల(ఈవీ) సర్వీసు టెక్నిషియన్ ఉద్యోగాలు కల్పించేందుకు కలెక్టరేట్‌లోని ఎంప్లాయీమెంట్ ఎక్చేంజి ఆఫీస్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తామని వివరించారు. ఇంటర్మీడియట్, ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగ యువతీయువకులు జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.15వేల నుంచి రూ.18వేల వేతనం ఉంటుందన్నారు. 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 40 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం ఉందని, ఆసక్తిగల వారు విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌లు, బయోడేటాతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 77299 92061, 97003 02582, 98853 46768 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అరికట్టాలి
సిరిసిల్లటౌన్: తెలంగాణాలోని గురుకుల విద్యాసంస్థల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం అరికట్టాలని ిబీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ కోరారు. మంగళవారం స్థానిక నేతన్న చౌక్‌లో నిరసన చేపట్టి మాట్లాడారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గురుకుల బాలికల వసతి గృహంలో కలుషిత ఆహారం కారణంగా సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శణమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు. గురుకులాల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌కే అప్రోచ్, అరికెల వినయ్‌కుమార్, మార్గం కార్తికేయ, సాయినవీన్, ఎస్‌కే జుబేర్, లింగంపల్లి అబ్బి, అనురిత్ శివ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
వేములవాడఅర్బన్: మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం వేములవాడ పట్టణంలోని కార్యాలయంలో కేక్ కట్ చేసి మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టసభలలో 33 శాతం మహిళల రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పొలాస నరేందర్, నాయకులు మారం కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్రవంతి, కళ్యాణి, శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి పలువురి సస్పెన్షన్
సిరిసిల్ల అర్బన్: జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను విభేదించి రెబల్స్‌గా పోటీ చేసిన అభ్యర్థులను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డిన నాయకులను పార్టీ సస్పెండ్ చేయడం జరిగిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నాగుల రాముగౌడ్, హైమద్‌పాషా(అడ్డు), కుమ్మరి శేఖర్, ఇర్ఫాన్, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వెంగళ అశోక్, శ్రీరాముల వెంకటేశం, శరణ్య, బూర యాదగిరి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని, సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.


