జిల్లాలో..
ఈనెల 14 నుంచి ప్రారంభం
ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు
జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి
‘ఇది జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. దీనిని ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సెంటర్‌గా కేటాయించారు. ఈ పాఠశాలకు రావడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోగా గదులు కూడా వెలుతురు లేకుండా ఇరుకుగా ఉంటాయి. ఈ పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేవని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు విమర్శిస్తున్నా.’
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఈనెల 14 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ వెల్లడించింది. ప్రతి పరీక్ష కేంద్రం సీఎస్ గదిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్న పత్రాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు అన్నీ సౌకర్యాలు ఉండేలా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్లు వివరించారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు హాల్ టికెట్ల విషయంలో ఇబ్బందులు పడకుండా అధికారిక, పలు వెబ్‌సైట్‌లలో నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంతకం లేకున్నా ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లను అనుమతించాలని నిబంధనలు ఉన్నట్లు తెలిపారు.
పదో తరగతి విద్యార్థులు 7,317
పరీక్ష కేంద్రాలు 34
ఇన్విజిలేటర్లు 530
ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు 02
సిట్టింగ్ స్క్వాడ్స్ 34


