సిరిసిల్ల: ప్రతీ ప్రభుత్వ ఆఫీస్‌లో నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో మంగళవారం స్వచ్ఛత.. పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ హాజరై తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రిని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
శిక్షణకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. జిల్లాలో ఎన్నికై న సర్పంచులు, మున్సిపల్ చైర్మన్, చైర్‌పర్సన్, వార్డ్ సభ్యులకు ఈ నెల 12న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద వ్యవసాయ కళాశాలలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఈ మేరకు పీపీటీ ప్రదర్శన, భోజనం, స్నాక్స్ ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. డీఆర్డీవో మచ్చ గీత, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీఏవో అఫ్జల్ బేగం, రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, పశు వైద్య, సంవర్థక అధికారి రవీందర్‌రెడ్డి, సీపీవో శ్రీనివాసాచారి, సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాందాస్, పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, ట్రెజరీ అధికారి నవీన్‌కుమార్, పరిశ్రమల అధికారి హనుమంతు, వైద్యాధికారి రజిత, మిషన్ భగీరథ అధికారి అన్వర్, సెస్ ఎండీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


