చందుర్తి(వేములవాడ): మండలంలోని మల్యాల పంపుహౌజ్‌కు మంగళవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు చేరుకున్నాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నందిమేడారం పంప్‌హౌజ్‌లో శనివారం రెండో మోటారు ప్రారంభించడంతో ఎట్టకేళకు ఎల్లంపల్లి నీళ్లు చందుర్తి మండలానికి చేరుకున్నాయని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి తెలిపారు. కాగా చందుర్తి శి వారులో గంగయ్య పొలం వద్ద గ్రావిటి కెనాల్ కాలువలో నీళ్లు అధికంగా రావడంతో కాలు వకు గండి పడే అవకాశం ఉందని వెంటనే టిప్పర్లతో మట్టి పోయించారు. పంప్‌హౌజ్ నుంచి రుద్రంగికి నీటి పంపింగ్ చేపట్టనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
రైల్వే నిర్వాసితులకు నోటీసులు
వేములవాడఅర్బన్: రైల్వే భూ సేకరణలో భాగంగా వేములవాడ పరిధిలోని నిర్వాసితులకు మంగళవారం రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. వేములవాడ, నాంపల్లి, శాత్రాజుపల్లి గ్రామాల్లో మొత్తం 317 మంది భూ నిర్వాసితులు ఉండగా 218 మందికి అందజేశామని, మిగతావారికి కూడా అందజేస్తామని ఆర్‌ఐ శ్రీధర్ తెలిపారు. రైల్వే లైన్ నిర్మాణం కోసం ప్రాథమికంగా వేసిన ప్రకటన అనంతరం రెండో దఫా నోటీసులు అందజేస్తున్నామన్నారు. ఇందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 12న తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే సభకు హాజరై తెలుపాలని పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది సంజీవ్, గణేశ్, మారుతి, రాములు తదితరులు ఉన్నారు.


