మహిళ సంక్షేమానికి పెద్ద పీట | - | Sakshi
Sakshi News home page

మహిళ సంక్షేమానికి పెద్ద పీట

Mar 10 2026 7:17 AM | Updated on Mar 10 2026 7:17 AM

మహిళ సంక్షేమానికి పెద్ద పీట ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడఅర్బన్‌: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడ మండలం అనుపురం, మారుపాక, చీర్లవంచ, గుర్రంవానిపల్లి, కొడుముంజ గ్రామాల్లో రూ.50లక్షలతో ఐదు మహిళా సమాఖ్య సంఘం భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ భూమిపూజ చేశారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నాయన్నారు.

గ్యాస్‌ ధరలు తగ్గించాలి

సిరిసిల్లటౌన్‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు పార్టీ

ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్ల అంబేడ్కర్‌చౌరస్తాలో ధర్నా చేపట్టి మాట్లాడారు. కేంద్రం పెంచిన వంట గ్యాస్‌ ధరను వెంటనే తగ్గించాలని కోరారు. సీపీఎం నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, శ్రీరాముల రమేశ్‌చంద్ర, మిట్టపల్లి రాజమల్లు, ఎలిగేటి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

3వ రిలే కార్నివాల్‌ పోటీల్లో ప్రతిభ

సిరిసిల్ల అర్బన్‌: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 3వ రిలే కార్నివాల్‌ పోటీలు సోమవారం జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి సర్టిఫికెట్స్‌, మెడల్స్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్‌ అందజేశారు. విజేతలు ఈనెల 15న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని తెలిపారు. పీఈటీలు కడారి అశోక్‌కుమార్‌, రాజు, సాయికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement