అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోండి

Mar 10 2026 7:17 AM | Updated on Mar 10 2026 7:17 AM

అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోండి పెండింగ్‌ వేతనాలు చెల్లించండి ఫైనల్‌ పేమెంట్‌ మంజూరు చేయాలి

కోనరావుపేట మండలం కొలనూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు 12 ఎకరాల వ్యవసాయ భూమిలో అనుమతులు లేకుండా ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించారు. దీనిపై చాలాసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి.

– కొలనూరు గ్రామస్తులు

మేము తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖలో టెక్నికల్‌ విభాగంలో ఈ పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాం. జిల్లాలోని 12 మండలాల్లో పనిచేస్తున్న ఈ పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఇప్పటికై నా ఆపరేటర్ల వేతనాలు ఇప్పించండి.

– ఈ–పంచాయతీ కంప్యూటర్‌ ఆపరేటర్లు

జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల ప్రతిపాదనలు సమర్పించినా జీపీఎఫ్‌ ఫైనల్‌ పేమెంట్‌ మంజూరు చేయడం లేదు. మాకు రావాల్సిన జీపీఎఫ్‌ ఫైనల్‌ పేమెంట్స్‌ క్లియర్‌ చేయాలి.

– జిల్లా విశ్రాంత ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement