మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలకు చట్టాలపై అవగాహన ఉండాలి

Mar 10 2026 7:17 AM | Updated on Mar 10 2026 7:17 AM

● సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌

● సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌

వేములవాడ: మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని వేములవాడ సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కోర్టు ఆవరణలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి జ్యోతిర్మయి, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని సన్మానించారు. మహిళలకు సమాజంలో సమాన హక్కులు కల్పించేందుకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణ కల్పించిందన్నారు. మహిళల అభివృద్ధి సమాజ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు కటకం జనార్దన్‌, మాజీ అధ్యక్షుడు గుండ రవి, ఏజీపీలు బొడ్డు ప్రశాంత్‌, పుప్పాల భానుకృష్ణ, మహిళా న్యాయవాదులు కొడిమ్యాల సంగీత, జక్కుల పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement