చందుర్తి(వేములవాడ): మాతృమూర్తుల చేతులమీదుగా హాల్‌టికెట్లు అందుకున్న పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా తల్లులకు పాదాభివందనం చేశారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని చందుర్తి మండలం మర్రిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని తల్లులు దీవించారు. ఎంఈవో, స్కూల్ హెచ్‌ఎం వినయ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్ ప్రకాశవంతంగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు గంగనర్సయ్య, వేణుగోపాల్, కనకయ్య, సావిత్రి, జ్యోతిరాణి, సరోజ, పద్మ పాల్గొన్నారు.
మర్రిగడ్డ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను దీవించిన తల్లులు


