వేములవాడ: ఐదు రోజులుగా వైభవంగా కొనసాగుతున్న శివకల్యాణోత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేకంగా నిర్మించిన ధర్మగుండంలో త్రిశూలయాత్ర నిర్వహించారు. ఐదు రోజులుగా సాగుతున్న శివకల్యాణోత్సవాలు ముగిసినట్లు ఈవో రమాదేవి తెలిపారు. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో 50 వేల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈవో రమాదేవి అధికారులకు సూచించారు.


